Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తెలంగాణ గ్రామ పంచాయతీలకు ఊరట.. సొంత ఆదాయం నేరుగా ఖాతాల్లోకి!

Author
Posted By Marelli kiran
| 07 Nov 2026, 09:16 PM |
తెలంగాణ గ్రామ పంచాయతీలకు ఊరట.. సొంత ఆదాయం నేరుగా ఖాతాల్లోకి!

హనుమకొండ, నవంబర్ 7 (ప్రజానేస్తం జ్వాల):

తెలంగాణలోని గ్రామ పంచాయతీల ఆర్థిక నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీలకు వివిధ మార్గాల ద్వారా సమకూరే సొంత ఆదాయాన్ని ఇకపై ప్రభుత్వ ట్రెజరీ ఖాతాలో జమ చేయకుండా, నేరుగా ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నూతన విధానం అక్టోబర్ 9 నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

గతంలో పంచాయతీల సొంత ఆదాయం ట్రెజరీ ఖాతాలో జమ కావడంతో అవసరమైన పనుల కోసం నిధులు వినియోగించుకోవడంలో జాప్యం ఎదురయ్యేది. పారిశుద్ధ్య నిర్వహణ, సిబ్బంది వేతనాలు, వీధి దీపాల నిర్వహణతో పాటు అత్యవసర అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చేయాలంటే సంబంధిత అనుమతులు, బిల్లుల మంజూరు కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. దీంతో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు.

ఇవి కూడా చదవండి

తాజా ఉత్తర్వులతో పంచాయతీలకు సమకూరే సొంత ఆదాయాన్ని నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకునే అవకాశం కలగనుంది. దీనివల్ల స్థానిక అవసరాలకు అనుగుణంగా నిధులను వినియోగించుకోవడం సులభతరం కానుందని భావిస్తున్నారు. అయితే, నిధుల వినియోగానికి సంబంధించిన నిబంధనలు, లెక్కల నిర్వహణ, పారదర్శకతపై ప్రభుత్వ మార్గదర్శకాలను పంచాయతీలు పాటించాల్సి ఉంటుంది.