తెలంగాణ గ్రామ పంచాయతీలకు ఊరట.. సొంత ఆదాయం నేరుగా ఖాతాల్లోకి!

హనుమకొండ, నవంబర్ 7 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణలోని గ్రామ పంచాయతీల ఆర్థిక నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీలకు వివిధ మార్గాల ద్వారా సమకూరే సొంత ఆదాయాన్ని ఇకపై ప్రభుత్వ ట్రెజరీ ఖాతాలో జమ చేయకుండా, నేరుగా ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నూతన విధానం అక్టోబర్ 9 నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో పంచాయతీల సొంత ఆదాయం ట్రెజరీ ఖాతాలో జమ కావడంతో అవసరమైన పనుల కోసం నిధులు వినియోగించుకోవడంలో జాప్యం ఎదురయ్యేది. పారిశుద్ధ్య నిర్వహణ, సిబ్బంది వేతనాలు, వీధి దీపాల నిర్వహణతో పాటు...