Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సూర్యాపేటలో 1.5 కిలోల గంజాయి పట్టివేత.. నలుగురి అరెస్ట్!

Author
Posted By Praja Nestham Jwala News
| 07 Nov 2026, 03:53 PM |
సూర్యాపేటలో 1.5 కిలోల గంజాయి పట్టివేత.. నలుగురి అరెస్ట్!

ఒడిశా నుంచి గంజాయి తెచ్చి విక్రయించేందుకు యత్నం!
1,500 గ్రాముల గంజాయి స్వాధీనం.. నలుగురి అరెస్ట్, ఇద్దరు పరారీ

సూర్యాపేట, నవంబర్‌ 7 (ప్రజానేస్తం జ్వాల): సూర్యాపేట పట్టణంలో 1,500 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేసినట్లు పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య తెలిపారు. మరో ఇద్దరు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసుల ప్రకారం.. నమ్మదగిన సమాచారం మేరకు ఎస్సై రామచంద్ర గౌడ్ సిబ్బందితో కలిసి చివ్వెంల రహదారిలోని అమ్మ గార్డెన్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులను గుర్తించిన ఇద్దరు వ్యక్తులు పరారయ్యారని, అక్కడికి గంజాయి తీసుకునేందుకు వచ్చిన మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విచారణలో బొంత అవినాష్, సోమపంగు నాని వర్ధన్ ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి గంజాయి తీసుకొచ్చేందుకు వెళ్లినట్లు, అరెస్టయిన నలుగురు వారికి డబ్బులు సమకూర్చినట్లు వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు.

అరెస్టయిన వారిని రూపాని సందీప్, బొడ్డు భరత్, పులుసు సాయి విశాల్ గౌడ్, శీలం శ్రీకాంత్ లింగయ్యగా గుర్తించారు. పరారీలో ఉన్న బొంత అవినాష్, సోమపంగు నాని వర్ధన్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు తెలిపారు. నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు, వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ హెచ్చరించారు. ఈ కేసును ఛేదించిన ఎస్సై రామచంద్ర గౌడ్‌తో పాటు పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు.

ఇవి కూడా చదవండి