సూర్యాపేటలో 1.5 కిలోల గంజాయి పట్టివేత.. నలుగురి అరెస్ట్!
ఒడిశా నుంచి గంజాయి తెచ్చి విక్రయించేందుకు యత్నం! 1,500 గ్రాముల గంజాయి స్వాధీనం.. నలుగురి అరెస్ట్, ఇద్దరు పరారీ సూర్యాపేట, నవంబర్ 7 (ప్రజానేస్తం జ్వాల): సూర్యాపేట పట్టణంలో 1,500 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేసినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య తెలిపారు. మరో ఇద్దరు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసుల ప్రకారం.. నమ్మదగిన సమాచారం మేరకు ఎస్సై రామచంద్ర గౌడ్ సిబ్బందితో కలిసి చివ్వెంల రహదారిలోని అమ్మ గార్డెన్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులను గుర్తించిన ఇద్దరు వ్యక్తులు పరారయ్యారని, అక్కడికి గంజాయి తీసుకునేందుకు వచ్చిన మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విచారణలో...