Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం

Author
Posted By Praja Nestham Jwala News
| 07 Nov 2026, 02:48 PM |
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం


నవంబర్ 21 వరకు ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు అవకాశం, ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు మరో అవకాశం : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి

సూర్యాపేట, నవంబర్ 7 (ప్రజానేస్తం జ్వాల): అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఎన్నికల సంఘం లక్ష్యమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR-2026) ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు కాని అర్హులకు మరో అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. నవంబర్ 21వ తేదీ వరకు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించవచ్చని పేర్కొన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం - Additional Image

శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో SIR-2026 ప్రక్రియ, ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ, ఓటరు జాబితాలో పేర్ల నమోదు, గైర్హాజరు, చిరునామా మార్పు, మరణించిన, ద్వంద్వ ఓటర్ల వివరాలపై సమీక్షించారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించని అర్హులైన ఓటర్లకు భారత ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని తెలిపారు. గైర్హాజరు, చిరునామా మార్పు, మరణం, ద్వంద్వ ఓటింగ్ తదితర కారణాలతో ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు లేని అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ ఎన్యుమరేషన్ ఫారం సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

అర్హులైన ఓటర్లకు విస్తృత అవగాహన కల్పించాలి

బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటి విచారణ చేపట్టి ఓటరు జాబితాలో పేర్లు లేని అర్హులను గుర్తించాలని సూచించారు. ఫారాలు అందని వారికి తిరిగి అందజేసేలా చర్యలు తీసుకోవాలని, ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ వివరాలు అనుసంధానమైన ఓటర్లకు వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా కూడా ఫారాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు.

ఇవి కూడా చదవండి

పోలింగ్ కేంద్రాల్లో జాబితాల ప్రదర్శన

గైర్హాజరు, చిరునామా మార్పు, మరణించిన, ద్వంద్వ ఓటర్ల (ASDD) వివరాలను పోలింగ్ కేంద్రాల వారీగా జాబితాల రూపంలో ప్రదర్శించాలని ఆదేశించారు. ఆయా ఓటర్ల పేర్లు జాబితాలో లేకపోవడానికి గల కారణాలను కూడా స్పష్టంగా పేర్కొనాలని తెలిపారు. ఈ వివరాలను పోలింగ్ కేంద్రాలతో పాటు ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచాలని సూచించారు.

ఆన్‌లైన్‌లోనూ ఫారాల సమర్పణకు అవకాశం

ఓటర్లు తమ పాత ఎపిక్ నంబర్ ఆధారంగా ఎన్నికల సంఘం వెబ్‌సైట్, ఈసీఐనెట్ యాప్ ద్వారా ఎన్యుమరేషన్ ఫారాలను డౌన్‌లోడ్ చేసుకుని సమర్పించవచ్చని తెలిపారు. ఒకే చిరునామాలో నివసిస్తున్నప్పటికీ గతంలో ఫారం సమర్పించలేకపోయిన వారు అందుకు గల కారణాలను వివరిస్తూ డిక్లరేషన్ ఇవ్వాలని సూచించారు. చిరునామా మారిన వారు కొత్త చిరునామాకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని పేర్కొన్నారు.

సమర్పించిన ఫారాలను సంబంధిత ఎన్నికల అధికారులు నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హులైన ఓటర్ల పేర్లను తుది జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తూ ప్రజలకు అవసరమైన సమాచారం అందించాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, ఎన్నికల సిబ్బంది రాజేందర్ రెడ్డి, భరత్, రణధీర్ తదితరులు పాల్గొన్నారు.