Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం

Author
Posted By Praja Nestham Jwala News
| 07 Nov 2026, 02:45 PM |
జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం

క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడవచ్చు

ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవాలి.. 14 ఏళ్లు నిండిన బాలికలకు హెచ్‌పీవీ టీకా వేయించాలి: డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకట రమణ


సూర్యాపేట, నవంబర్‌ 7 (ప్రజానేస్తం జ్వాల): క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపుపై అవగాహన కల్పించేందుకు జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మోతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లాస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకట రమణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడవచ్చన్నారు. పొగాకు వినియోగం, ధూమపానం, మద్యపానం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం క్యాన్సర్‌కు ప్రమాద కారకాలన్నారు. ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

నోటిలో పుండ్లు తగ్గకపోవడం, రొమ్ముల్లో గడ్డలు, అసాధారణ రక్తస్రావం, కారణం తెలియకుండా బరువు తగ్గడం, దీర్ఘకాలిక దగ్గు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్న నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు 14 ఏళ్లు నిండిన ప్రతి బాలికకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల ద్వారా క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు, పరీక్షలు, చికిత్సపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి. చంద్రశేఖర్, వైద్యాధికారులు డాక్టర్ భవాని, డాక్టర్ శ్రీనివాస రాజు, డిప్యూటీ డెమో వి. సంజీవ్ రెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.