జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం

క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడవచ్చు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవాలి.. 14 ఏళ్లు నిండిన బాలికలకు హెచ్‌పీవీ టీకా వేయించాలి: డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకట రమణ సూర్యాపేట, నవంబర్‌ 7 (ప్రజానేస్తం జ్వాల): క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపుపై అవగాహన కల్పించేందుకు జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మోతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లాస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకట రమణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడవచ్చన్నారు. పొగాకు వినియోగం,...