Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం.. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Author
Posted By Nagaraju Golla
| 06 Nov 2026, 07:52 PM |
రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం.. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఘనపురం, నవంబర్ 6 (ప్రజానేస్తం జ్వాల): రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా, ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి కోతలు విధించకుండా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు.

భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని ఘనపురం మండలం గొల్లపల్లి గ్రామంలో చెల్పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ధాన్యం తూకం, లోడింగ్, అన్‌లోడింగ్ ప్రక్రియలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, కొనుగోళ్లలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు న్యాయం జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు మద్దతుగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రైతులు ధాన్యం విక్రయించే సమయంలో నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ కొనుగోలు కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో చెల్పూర్ పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, పీఏసీఎస్ కార్యవర్గ సభ్యులు, సంబంధిత అధికారులు, చెల్పూర్ మరియు ఘనపురం మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.