రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం.. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఘనపురం, నవంబర్ 6 (ప్రజానేస్తం జ్వాల): రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా, ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి కోతలు విధించకుండా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని ఘనపురం మండలం గొల్లపల్లి గ్రామంలో చెల్పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు...