Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కొత్తకొండ వీరభద్రస్వామి జాతర టెండర్లతో రూ.30 లక్షలకు పైగా ఆదాయం

Author
Posted By Nagilla Rajinikanth
| 06 Nov 2026, 07:32 PM |
కొత్తకొండ వీరభద్రస్వామి జాతర టెండర్లతో రూ.30 లక్షలకు పైగా ఆదాయం

భీమదేవరపల్లి, నవంబర్ 6, (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో 2027 జాతర నిర్వహణకు సంబంధించి చేపట్టిన టెండర్ కమ్ బహిరంగ వేలంలో పలు హక్కులను వ్యాపారులు పోటాపోటీగా దక్కించుకున్నారు. ఈ వేలం ప్రక్రియ ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షలకు పైగా ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ కిషన్ రావు తెలిపారు.

దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో పరిశీలకురాలు నందనం కవిత పర్యవేక్షణలో వేలం నిర్వహించారు. ఇందులో కొబ్బరికాయలు, పూజా సామగ్రి విక్రయ హక్కును కొత్తకొండకు చెందిన కొక్కర కొండ రాజు రూ.14,61,000కు దక్కించుకున్నారు. గుమ్మడికాయలు, కోరమీసాల విక్రయ హక్కును అదే గ్రామానికి చెందిన చెంగల కొమురయ్య రూ.10,47,000కు కైవసం చేసుకున్నారు.

ఇతర హక్కుల వివరాలు ఇలా ఉన్నాయి. తలనీలాల సేకరణ హక్కును కొత్తకొండకు చెందిన కొలిపాక కొమురయ్య రూ.17,500కు, టెంట్ హౌస్ సామగ్రి సరఫరా హక్కును బుర్ర సమ్మయ్య రూ.1,35,000కు దక్కించుకున్నారు. పందిరిలో తడకలు వేసే పనిని హుస్నాబాద్‌కు చెందిన ములంగూరి చందు రూ.90,000కు, లైటింగ్, డెకరేషన్ పనులను కొత్తగట్టుకు చెందిన ఉమ్మెత్త నిరంజన్ రెడ్డి రూ.1,90,000కు కైవసం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మిగిలిన టెండర్ల నిర్వహణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రముఖులు, భక్తులు, అర్చకులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.