కొత్తకొండ వీరభద్రస్వామి జాతర టెండర్లతో రూ.30 లక్షలకు పైగా ఆదాయం

భీమదేవరపల్లి, నవంబర్ 6, (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో 2027 జాతర నిర్వహణకు సంబంధించి చేపట్టిన టెండర్ కమ్ బహిరంగ వేలంలో పలు హక్కులను వ్యాపారులు పోటాపోటీగా దక్కించుకున్నారు. ఈ వేలం ప్రక్రియ ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షలకు పైగా ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ కిషన్ రావు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో పరిశీలకురాలు నందనం కవిత పర్యవేక్షణలో వేలం నిర్వహించారు. ఇందులో కొబ్బరికాయలు, పూజా సామగ్రి విక్రయ హక్కును కొత్తకొండకు చెందిన కొక్కర కొండ రాజు రూ.14,61,000కు దక్కించుకున్నారు. గుమ్మడికాయలు, కోరమీసాల విక్రయ హక్కును అదే గ్రామానికి చెందిన చెంగల కొమురయ్య రూ.10,47,000కు...