Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అంగన్వాడీ ఉద్యోగాలకు భారీ పోటీ.. 23 పోస్టులకు 630 దరఖాస్తులు!

Author
Posted By Nagilla Rajinikanth
| 06 Nov 2026, 04:45 PM |
అంగన్వాడీ ఉద్యోగాలకు భారీ పోటీ.. 23 పోస్టులకు 630 దరఖాస్తులు!

సర్టిఫికెట్ల పరిశీలనకు 435 మంది హాజరు.. 195 మంది గైర్హాజరు

భీమదేవరపల్లి, నవంబర్‌ 6 (ప్రజానేస్తం జ్వాల):

హనుమకొండ జిల్లాలో అంగన్వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి భారీ పోటీ నెలకొంది. కేవలం 23 పోస్టుల కోసం ఏకంగా 630 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఒక్కో పోస్టుకు సగటున 27 మందికి పైగా పోటీ పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

భీమదేవరపల్లి ప్రాజెక్టు పరిధిలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్‌, హసన్‌పర్తి మండలాల్లో ఖాళీగా ఉన్న 23 అంగన్వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మొత్తం 630 దరఖాస్తులు అందగా, గత నెలలో నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు 435 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మరో 195 మంది గైర్హాజరయ్యారు.

ఈ వివరాలను భీమదేవరపల్లి ప్రాజెక్టు సీడీపీఓ స్వరూప వెల్లడించారు. దీపావళి అనంతరం సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన అభ్యర్థులకు ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం తదుపరి ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

23 పోస్టులు.. 630 మంది అభ్యర్థులు.. తుది ఎంపికలో ఉద్యోగాలు ఎవరిని వరిస్తాయోనన్న ఆసక్తి నెలకొంది.