అంగన్వాడీ ఉద్యోగాలకు భారీ పోటీ.. 23 పోస్టులకు 630 దరఖాస్తులు!

సర్టిఫికెట్ల పరిశీలనకు 435 మంది హాజరు.. 195 మంది గైర్హాజరు భీమదేవరపల్లి, నవంబర్‌ 6 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లాలో అంగన్వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి భారీ పోటీ నెలకొంది. కేవలం 23 పోస్టుల కోసం ఏకంగా 630 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఒక్కో పోస్టుకు సగటున 27 మందికి పైగా పోటీ పడుతున్నారు. భీమదేవరపల్లి ప్రాజెక్టు పరిధిలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్‌, హసన్‌పర్తి మండలాల్లో ఖాళీగా ఉన్న 23 అంగన్వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మొత్తం 630 దరఖాస్తులు అందగా, గత నెలలో నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు 435 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మరో 195...