Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వ్యవసాయ వ్యర్థాలే సేంద్రియ ఎరువులు.. రైతులకు విద్యార్థుల ప్రత్యక్ష అవగాహన

Author
Posted By Praja Nestham Jwala News
| 06 Nov 2026, 02:38 PM |
వ్యవసాయ వ్యర్థాలే సేంద్రియ ఎరువులు.. రైతులకు విద్యార్థుల ప్రత్యక్ష అవగాహన

గరిడేపల్లి, నవంబర్ 6, (ప్రజానేస్తం జ్వాల): సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో వ్యవసాయ వ్యర్థాలను సద్వినియోగం చేసుకుంటూ తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవాలని బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు రైతులకు సూచించారు.

గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమంలో భాగంగా ఏలూరులోని సీహెచ్‌ఎస్‌డీ సెయింట్ థెరిస్సా మహిళా కళాశాలకు చెందిన బీఎస్సీ అగ్రికల్చర్ చివరి సంవత్సరం విద్యార్థులు, గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం మార్గదర్శకత్వంలో కీతవారిగూడెం గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ వ్యర్థాలు, ఎండిన ఆకులు, ఇతర సేంద్రియ పదార్థాలను శాస్త్రీయ పద్ధతిలో కుళ్ళింపజేసి నాణ్యమైన సేంద్రియ ఎరువుగా తయారు చేసుకునే విధానాన్ని ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించారు. సేంద్రియ ఎరువుల వినియోగంతో భూసారం పెరగడంతో పాటు నేలలో సేంద్రియ పదార్థం వృద్ధి చెంది, పంటల ఆరోగ్యకరమైన పెరుగుదలకు దోహదపడుతుందని తెలిపారు. రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు సాగు ఖర్చులను నియంత్రించుకోవచ్చని వివరించారు.

ఈ కార్యక్రమంలో రైతులు గుండు సతీష్, వెల్పుల రామలింగయ్య, నర్సింగ్ నరేష్, ఎస్.కె. పెరుసాహెబ్, కట్రేవుల వెంకటేష్, ముంతా నాగయ్య, యల్లావుల రాములు, కట్రేవుల నర్సయ్య, సనగాని వెంకటేష్, బడేటి వినయ్, దాసరి సైదులు, పిల్లి యాదగిరి, బొల్లెపల్లి పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని అగ్రికల్చర్ విద్యార్థులు ఎం. నవ్యశ్రీ, వి. మనీషా, పి. హేమలత, ఐ. సత్యశ్రీ, వి. సౌమ్య, ఆర్. మోనిక నిర్వహించారు.

వ్యవసాయ వ్యర్థాలే సేంద్రియ ఎరువులు.. రైతులకు విద్యార్థుల ప్రత్యక్ష అవగాహన - Additional Imageవ్యవసాయ వ్యర్థాలే సేంద్రియ ఎరువులు.. రైతులకు విద్యార్థుల ప్రత్యక్ష అవగాహన - Additional Image