వ్యవసాయ వ్యర్థాలే సేంద్రియ ఎరువులు.. రైతులకు విద్యార్థుల ప్రత్యక్ష అవగాహన

గరిడేపల్లి, నవంబర్ 6, (ప్రజానేస్తం జ్వాల): సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో వ్యవసాయ వ్యర్థాలను సద్వినియోగం చేసుకుంటూ తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవాలని బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు రైతులకు సూచించారు. గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమంలో భాగంగా ఏలూరులోని సీహెచ్‌ఎస్‌డీ సెయింట్ థెరిస్సా మహిళా కళాశాలకు చెందిన బీఎస్సీ అగ్రికల్చర్ చివరి సంవత్సరం విద్యార్థులు, గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం మార్గదర్శకత్వంలో కీతవారిగూడెం గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ వ్యర్థాలు, ఎండిన ఆకులు, ఇతర సేంద్రియ పదార్థాలను శాస్త్రీయ పద్ధతిలో కుళ్ళింపజేసి నాణ్యమైన సేంద్రియ ఎరువుగా తయారు చేసుకునే విధానాన్ని ప్రత్యక్ష ప్రదర్శన...