Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

*వ్యవసాయ రుణాల లక్ష్య సాధనపై బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి సారించాలి*

Author
Posted By Praja Nestham Jwala News
| 05 Nov 2026, 08:00 PM |
*వ్యవసాయ రుణాల లక్ష్య సాధనపై బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి సారించాలి*

*కరువు ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌కు చర్యలు తీసుకోవాలి*

సూర్యాపేట, నవంబర్‌ 5 (ప్రజానేస్తం జ్వాల):

జిల్లాలో వ్యవసాయ, ప్రాధాన్యత రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను సాధించేందుకు బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమన్వయ కమిటీ (డీసీసీ/డీఎల్ఆర్‌సీ) సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటనాగప్రసాద్ కన్వీనర్‌గా వ్యవహరించారు.

*రుణ లక్ష్యాల పురోగతి*

సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. వ్యవసాయ స్వల్పకాలిక రుణాలకు వార్షిక లక్ష్యం రూ.4,245.14 కోట్లు కాగా, ఆరు నెలల్లో రూ.2,749.14 కోట్ల రుణాల పురోగతి నమోదైంది. దీర్ఘకాలిక రుణాలకు రూ.3,733.06 కోట్ల వార్షిక లక్ష్యం నిర్దేశించగా, రూ.2,447.91 కోట్ల పురోగతి సాధించారు.

ఇవి కూడా చదవండి

స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు కలిపి మొత్తం వ్యవసాయ రుణాల వార్షిక లక్ష్యం రూ.7,978.20 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.5,197.05 కోట్ల పురోగతి నమోదైంది.

ప్రాధాన్యత రంగాలకు సంబంధించి రూ.10,832.53 కోట్ల వార్షిక లక్ష్యానికి గాను రూ.6,204.35 కోట్ల పురోగతి సాధించారు. జిల్లా వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.13,336.67 కోట్లు కాగా, గడిచిన ఆరు నెలల్లో రూ.8,209.78 కోట్ల రుణాల పురోగతి నమోదైనట్లు సమావేశంలో వివరించారు.

*ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక సమీక్ష*

అనంతరం కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక డీసీసీ సమావేశం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఏర్పడిన తీవ్ర, మధ్యస్థ అనావృష్టి పరిస్థితులపై చర్చించారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా బ్యాంకర్లు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ సూచనలు చేశారు.

అనావృష్టి, కరువు ప్రభావిత ప్రాంతాల్లో రైతులు తీసుకున్న బ్యాంకు రుణాలను నిబంధనల ప్రకారం రీషెడ్యూల్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో డీఆర్‌డీఓ పీడీ సన్యాసయ్య, జనరల్ మేనేజర్ భారతి, బీసీ సంక్షేమ అధికారి విశాల్ ధార, ఎస్సీ సంక్షేమ అధికారి లత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఉపేందర్ రావు, నాబార్డ్ డీడీఎం రవీంద్ర నాయక్, ఆర్బీఐ ఏడీఎం చిరంజీవి, వివిధ బ్యాంకుల జిల్లా కోఆర్డినేటర్లు, శాఖల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.