*వ్యవసాయ రుణాల లక్ష్య సాధనపై బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి సారించాలి*
*కరువు ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్కు చర్యలు తీసుకోవాలి* సూర్యాపేట, నవంబర్ 5 (ప్రజానేస్తం జ్వాల): జిల్లాలో వ్యవసాయ, ప్రాధాన్యత రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను సాధించేందుకు బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమన్వయ కమిటీ (డీసీసీ/డీఎల్ఆర్సీ) సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటనాగప్రసాద్ కన్వీనర్‌గా వ్యవహరించారు. *రుణ లక్ష్యాల పురోగతి* సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. వ్యవసాయ స్వల్పకాలిక రుణాలకు వార్షిక లక్ష్యం రూ.4,245.14 కోట్లు కాగా, ఆరు నెలల్లో రూ.2,749.14 కోట్ల రుణాల పురోగతి నమోదైంది. దీర్ఘకాలిక రుణాలకు రూ.3,733.06...