Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

**ఆదివాసుల ఆరాధ్యదైవం పద్మాల్పూరి కాకోబాయిని దర్శించుకున్న సోయం బాపూరావు**

Author
Posted By Praja Nestham Jwala News
| 05 Nov 2026, 06:31 PM |
**ఆదివాసుల ఆరాధ్యదైవం పద్మాల్పూరి కాకోబాయిని దర్శించుకున్న సోయం బాపూరావు**

**గుడి రేవు పేటలో ప్రత్యేక పూజలు.. గుస్సాడి నృత్యాలతో ఘన స్వాగతం**

నవంబర్‌ 5 (ప్రజానేస్తం జ్వాల):

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడి రేవు పేట గ్రామంలో కొలువైన ఆదివాసుల ఆరాధ్యదైవం శ్రీశ్రీశ్రీ పద్మాల్పూరి కాకోబాయి (ఎత్మ సార్) దర్బార్‌కు మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఆలయానికి చేరుకున్న సోయం బాపూరావుకు ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం గుస్సాడి నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, తొమ్మిది తెగల ఆదివాసీ జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ దొర, మాజీ ఐటీడీఏ చైర్మన్ సిడం అర్జు, మాజీ చైర్మన్ కొట్నాక్ తిరుపతి, రాజ్ గోండ్ సేవా సమితి నాయకులు తానాజీ, కనక తులసిరాం తదితరులు పాల్గొన్నారు.