**ఆదివాసుల ఆరాధ్యదైవం పద్మాల్పూరి కాకోబాయిని దర్శించుకున్న సోయం బాపూరావు**
**గుడి రేవు పేటలో ప్రత్యేక పూజలు.. గుస్సాడి నృత్యాలతో ఘన స్వాగతం** నవంబర్ 5 (ప్రజానేస్తం జ్వాల): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడి రేవు పేట గ్రామంలో కొలువైన ఆదివాసుల ఆరాధ్యదైవం శ్రీశ్రీశ్రీ పద్మాల్పూరి కాకోబాయి (ఎత్మ సార్) దర్బార్‌కు మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సోయం బాపూరావుకు ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం గుస్సాడి నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ...