Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గుస్సాడి, దండారి కళల పరిరక్షణకు ప్రత్యేక నిధులు

Author
Posted By Praja Nestham Jwala News
| 05 Nov 2026, 06:09 PM |
గుస్సాడి, దండారి కళల పరిరక్షణకు ప్రత్యేక నిధులు

కరంజివాడ గోండ్ గూడలో వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ

కెరమెరి, నవంబర్‌ 5 (ప్రజానేస్తం జ్వాల):

ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గుస్సాడి, దండారి కళలను పరిరక్షించి, భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ తెలిపారు. ఈ కళలను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కెరమెరి మండలం కరంజివాడ (గోండ్ గూడ) గ్రామంలో నిర్వహించిన గుస్సాడి, దండారి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ఆమెకు ఆదివాసీలు సంప్రదాయ డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గుస్సాడి, దండారి నృత్య ప్రదర్శనలను తిలకించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆదివాసీల సంస్కృతి, ఆచార వ్యవహారాలు ఎంతో విశిష్టమైనవని, వాటి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. గిరిజన కళలు అంతరించిపోకుండా కళాకారులను ప్రోత్సహించడంతో పాటు ఆదివాసీల అస్తిత్వం, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ బల్వంత్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుజాయిత్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ సిడాం జగన్నాథరావు, మాజీ సర్పంచ్ శంకర్ నాయక్, మాజీ ఎంపీటీసీ సిడాం తిరుపతి, దేవిదాస్, జల్పత్ రావు, కుమ్రం దేవేందర్, అయూబ్ ఖాన్, ఆదివాసీ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.