గుస్సాడి, దండారి కళల పరిరక్షణకు ప్రత్యేక నిధులు

కరంజివాడ గోండ్ గూడలో వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ కెరమెరి, నవంబర్‌ 5 (ప్రజానేస్తం జ్వాల): ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గుస్సాడి, దండారి కళలను పరిరక్షించి, భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ తెలిపారు. ఈ కళలను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. కెరమెరి మండలం కరంజివాడ (గోండ్ గూడ) గ్రామంలో నిర్వహించిన గుస్సాడి, దండారి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ఆమెకు ఆదివాసీలు సంప్రదాయ డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గుస్సాడి, దండారి నృత్య ప్రదర్శనలను తిలకించారు. ఈ సందర్భంగా ఆమె...