Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పొగాకు రహిత యువతే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది

Author
Posted By Praja Nestham Jwala News
| 05 Nov 2026, 06:08 PM |
పొగాకు రహిత యువతే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది

విద్యార్థులకు పొగాకు దుష్ప్రభావాలు, క్యాన్సర్ నివారణపై వైద్యుల అవగాహన

భీమదేవరపల్లి, నవంబర్‌ 5 (ప్రజానేస్తం జ్వాల):

యువత పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని వైద్యులు సూచించారు. హనుమకొండ జిల్లా పి.వి. రంగారావు గురుకుల పాఠశాలలో వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా డాక్టర్లు రహ్మాన్, రుబీనా విద్యార్థులకు సిగరెట్లు, బీడీలు, గుట్కా, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, క్యాన్సర్ ముప్పు గురించి వివరించారు. చిన్న వయస్సులోనే చెడు అలవాట్లకు బానిసలు కాకుండా వాటికి దూరంగా ఉండాలని సూచించారు.

అలాగే బాలికల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ (HPV) టీకా ప్రాముఖ్యతను వివరించారు. వైద్యుల సూచన మేరకు అర్హులైన బాలికలు టీకా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అఫ్రీన్, హారిక, స్టాఫ్ నర్స్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.