పొగాకు రహిత యువతే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది
విద్యార్థులకు పొగాకు దుష్ప్రభావాలు, క్యాన్సర్ నివారణపై వైద్యుల అవగాహన భీమదేవరపల్లి, నవంబర్ 5 (ప్రజానేస్తం జ్వాల): యువత పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని వైద్యులు సూచించారు. హనుమకొండ జిల్లా పి.వి. రంగారావు గురుకుల పాఠశాలలో వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లు రహ్మాన్, రుబీనా విద్యార్థులకు సిగరెట్లు, బీడీలు, గుట్కా, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, క్యాన్సర్ ముప్పు గురించి వివరించారు. చిన్న వయస్సులోనే చెడు అలవాట్లకు బానిసలు కాకుండా వాటికి దూరంగా ఉండాలని సూచించారు. అలాగే బాలికల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు...