Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గుండెపోటుతో తేరటుపల్లి ఉప సర్పంచ్ బొట్టు శివకుమార్ మృతి

Author
Posted By Praja Nestham Jwala News
| 05 Nov 2026, 12:27 PM |
గుండెపోటుతో తేరటుపల్లి ఉప సర్పంచ్ బొట్టు శివకుమార్ మృతి

38 ఏళ్ల వయసులోనే కన్నుమూత.. గ్రామంలో విషాదఛాయలు

ఘట్టుప్పల్, నవంబర్‌ 5 (ప్రజానేస్తం జ్వాల): నల్లగొండ జిల్లా ఘట్టుప్పల్ మండలం తేరటుపల్లి గ్రామ ఉప సర్పంచ్ బొట్టు శివకుమార్ (38) గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మృతితో తేరటుపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న శివకుమార్ ఎస్ఎఫ్ఐలో క్రియాశీల కార్యకర్తగా పనిచేశారు. అనంతరం సీపీఎం తేరటుపల్లి గ్రామ శాఖ కార్యదర్శిగా, చండూరు మండల కార్యదర్శిగా, జిల్లా నాయకుడిగా పలు బాధ్యతలు నిర్వహించారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కూడా సేవలందించారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌గా కొనసాగుతున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేసిన శివకుమార్ మృతి గ్రామానికి తీరని లోటని పలువురు పేర్కొన్నారు.

ఆయన మృతికి ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు కట్ట నర్సింహ, మాజీ జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, మాజీ ఎంపీటీసీ గొరిగె సత్తయ్య, బొట్టు సుప్రిం, బండ యాదయ్య, పగిళ్ల సైదులు, శంకర్, మల్లేష్, శ్రీనివాస్, సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శి అచిన శ్రీనివాస్, హైదరాబాద్ పట్టణ ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు అచిన లెనిన్, పగిళ్ల మధు, సాయి, శివ తదితరులు నివాళులర్పించారు.