గుండెపోటుతో తేరటుపల్లి ఉప సర్పంచ్ బొట్టు శివకుమార్ మృతి

38 ఏళ్ల వయసులోనే కన్నుమూత.. గ్రామంలో విషాదఛాయలు ఘట్టుప్పల్, నవంబర్‌ 5 (ప్రజానేస్తం జ్వాల): నల్లగొండ జిల్లా ఘట్టుప్పల్ మండలం తేరటుపల్లి గ్రామ ఉప సర్పంచ్ బొట్టు శివకుమార్ (38) గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మృతితో తేరటుపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న శివకుమార్ ఎస్ఎఫ్ఐలో క్రియాశీల కార్యకర్తగా పనిచేశారు. అనంతరం సీపీఎం తేరటుపల్లి గ్రామ శాఖ కార్యదర్శిగా, చండూరు మండల కార్యదర్శిగా, జిల్లా నాయకుడిగా పలు బాధ్యతలు నిర్వహించారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కూడా సేవలందించారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌గా...