Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గంగారం ఉన్నత పాఠశాలలో ఘనంగా శకుంతలా దేవి 98వ జయంతి వేడుకలు

Author
Posted By Praja Nestham Jwala News
| 04 Nov 2026, 10:44 PM |
గంగారం ఉన్నత పాఠశాలలో ఘనంగా శకుంతలా దేవి 98వ జయంతి వేడుకలు

  • విద్యార్థుల్లో గణితంపై ఆసక్తి పెంపొందించాలి: రాజారాం ప్రకాష్


బిజినపల్లి, నవంబర్ 4 (ప్రజానేస్తం జ్వాల):

ప్రపంచ ప్రఖ్యాత గణిత మేధావి, హ్యూమన్ కంప్యూటర్గా పేరుగాంచిన శకుంతలా దేవి 98వ జయంతి వేడుకలను బుధవారం బిజినపల్లి మండల పరిధిలోని గంగారం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహనీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర చైర్మన్, ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ.. శకుంతలా దేవి అసాధారణ గణిత ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని తెలిపారు. అత్యంత క్లిష్టమైన గణిత సమస్యలను సైతం అద్భుత వేగంతో పరిష్కరించి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నారని పేర్కొన్నారు.

చిన్ననాటి నుంచే సంఖ్యలపై అసాధారణ పట్టు ప్రదర్శించిన ఆమె, తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారని గుర్తుచేశారు. గణితాన్ని సులభంగా అర్థం చేసుకునేలా పలు పుస్తకాలు రచించి, విద్యార్థుల్లో సంఖ్యల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు కృషి చేశారని అన్నారు.

శకుంతలా దేవి జీవితం విద్యార్థులకు గొప్ప స్ఫూర్తిదాయకమని, ఆమెను ఆదర్శంగా తీసుకుని పట్టుదల, సాధనతో విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కందుకూరు అశోక్ కుమార్, కొములయ్య, శ్రీకాంత్ రెడ్డి, నందకిషోర్, ఊర్మిళ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.