గంగారం ఉన్నత పాఠశాలలో ఘనంగా శకుంతలా దేవి 98వ జయంతి వేడుకలు
విద్యార్థుల్లో గణితంపై ఆసక్తి పెంపొందించాలి: రాజారాం ప్రకాష్ బిజినపల్లి, నవంబర్ 4 (ప్రజానేస్తం జ్వాల): ప్రపంచ ప్రఖ్యాత గణిత మేధావి, హ్యూమన్ కంప్యూటర్‌గా పేరుగాంచిన శకుంతలా దేవి 98వ జయంతి వేడుకలను బుధవారం బిజినపల్లి మండల పరిధిలోని గంగారం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహనీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర చైర్మన్, ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ.. శకుంతలా దేవి అసాధారణ గణిత ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని తెలిపారు. అత్యంత క్లిష్టమైన గణిత సమస్యలను సైతం అద్భుత వేగంతో పరిష్కరించి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. చిన్ననాటి నుంచే సంఖ్యలపై...