Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఆర్టీసీ ఉద్యోగిని ప్రవళిక మృతిపై సంతాప సభ

Author
Posted By Praja Nestham Jwala News
| 04 Nov 2026, 09:39 PM |
ఆర్టీసీ ఉద్యోగిని ప్రవళిక మృతిపై సంతాప సభ

పరకాల, నవంబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల): మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఉద్యోగిని ప్రవళిక అకాల మరణం పట్ల ఎంప్లాయిస్ యూనియన్ కూటమి, ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ కమిటీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బుధవారం పరకాల ఆర్టీసీ డిపో గేటు ఎదుట సంయుక్తంగా సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ యూనియన్ల నాయకులు, మహిళా కండక్టర్లు ప్రవళిక చిత్రపటానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు సుధాకర్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగులందరికీ తక్షణమే స్మార్ట్ కార్డులు అందించాలని కోరారు. ప్రవళిక మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ కమిటీ కార్యదర్శి ఈ.ఆర్. ప్రసాద్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులను సామర్థ్యానికి మించి ఎక్కించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయంతో పాటు అవసరమైన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ కమిటీ డిపో అధ్యక్షుడు లౌడియా గోవర్ధన్ నాయక్, ఎంప్లాయిస్ నాయకులు మంద శ్రీనివాస్, బి.డి. స్వామి, ఎన్‌ఎంయూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆహా శ్రీను, డిపో అధ్యక్షుడు ప్రభాకర్, కార్యదర్శి రఘువీర్, వివిధ యూనియన్ల ప్రతినిధులు, మహిళా కండక్టర్లు తదితరులు పాల్గొన్నారు.