ఆర్టీసీ ఉద్యోగిని ప్రవళిక మృతిపై సంతాప సభ
పరకాల, నవంబర్ 4 (ప్రజానేస్తం జ్వాల): మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఉద్యోగిని ప్రవళిక అకాల మరణం పట్ల ఎంప్లాయిస్ యూనియన్ కూటమి, ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ కమిటీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బుధవారం పరకాల ఆర్టీసీ డిపో గేటు ఎదుట సంయుక్తంగా సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ యూనియన్ల నాయకులు, మహిళా కండక్టర్లు ప్రవళిక చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు సుధాకర్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగులందరికీ తక్షణమే స్మార్ట్ కార్డులు అందించాలని కోరారు. ప్రవళిక మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు...