Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఎస్‌ఐఆర్‌పై మేధావుల సంగోష్టి

Author
Posted By Praja Nestham Jwala News
| 04 Nov 2026, 09:36 PM |
ఎస్‌ఐఆర్‌పై మేధావుల సంగోష్టి


పారదర్శక ఓటర్ల జాబితా రూపకల్పనకు ప్రజల భాగస్వామ్యం అవసరం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, నవంబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల): సిటిజన్ ఫర్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలోని సంఘమిత్ర కాలేజీలో అడ్వకేట్ చీర్ల అశోక్ రెడ్డి అధ్యక్షతన మేధావుల సంగోష్టి నిర్వహించారు.

ఎస్‌ఐఆర్‌పై మేధావుల సంగోష్టి - Additional Image

ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, చందుపట్ల కీర్తి రెడ్డి, తిరుపతి రెడ్డి, జనార్ధన్, రాములు తదితరులు పాల్గొని ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా ప్రక్షాళనపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్‌ఐఆర్‌ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దే అవకాశం ఉందన్నారు. మరణించిన వ్యక్తుల పేర్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓట్లను గుర్తించి నిబంధనల ప్రకారం సరిదిద్దడం ఈ ప్రక్రియలో భాగమని వివరించారు.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా చూడటం ముఖ్యమని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ఎన్నికల సంఘం చేపట్టే కార్యక్రమాలపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు మేధావులు, విద్యావంతులు, యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు ప్రాధాన్యత, ఓటర్ల జాబితా సవరణ విధానం గురించి ప్రజలకు వివరించాలని సూచించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, రాజ్యాంగ విలువలు, ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కృషి చేయాలని వక్తలు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏడునూతుల నిషీధర్ రెడ్డి, వెన్నంపల్లి పాపన్న, ఎరుకల గణపతి, చల్లా నారాయణరెడ్డి, డాక్టర్లు, ప్రైవేట్ ఉపాధ్యాయులు, న్యాయవాదులు, సింగరేణి ఉద్యోగులు, మేధావులు తదితరులు పాల్గొన్నారు.