ఎస్‌ఐఆర్‌పై మేధావుల సంగోష్టి

పారదర్శక ఓటర్ల జాబితా రూపకల్పనకు ప్రజల భాగస్వామ్యం అవసరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా, నవంబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల): సిటిజన్ ఫర్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలోని సంఘమిత్ర కాలేజీలో అడ్వకేట్ చీర్ల అశోక్ రెడ్డి అధ్యక్షతన మేధావుల సంగోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, చందుపట్ల కీర్తి రెడ్డి, తిరుపతి రెడ్డి, జనార్ధన్, రాములు తదితరులు పాల్గొని ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా ప్రక్షాళనపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్‌ఐఆర్‌ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దే అవకాశం ఉందన్నారు. మరణించిన వ్యక్తుల పేర్లు,...