Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నవంబర్‌ 7 నుంచి 20 వరకు టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి ప్రసాదాల పంపిణీ

Author
Posted By Praja Nestham Jwala News
| 04 Nov 2026, 07:57 PM |
నవంబర్‌ 7 నుంచి 20 వరకు టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి ప్రసాదాల పంపిణీ

తిరుపతి, నవంబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల): టీటీడీ విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ పింఛన్‌దారులకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాలను నవంబర్‌ 7 నుంచి 20వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

తిరుపతిలోని టీటీడీ క్యాంటీన్‌ వద్ద ఉన్న కొత్త జాబిలి భవనంలో ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రసాదాల పంపిణీ జరుగుతుంది. పింఛన్‌దారులు తమ స్మార్ట్‌ కార్డు చూపించి ఒక పెద్ద లడ్డూ, ఒక వడ ప్రసాదం పొందవచ్చు.

పీపీఓ నంబర్ల వారీగా పంపిణీ వివరాలు:
- నవంబర్‌ 7: 164 నుంచి 3,250 వరకు.
- నవంబర్‌ 9 నుంచి 13 వరకు: 3,251 నుంచి 9,050 వరకు.
- నవంబర్‌ 16 నుంచి 19 వరకు: 9,051 నుంచి 12,550 వరకు.
- నవంబర్‌ 20: 12,551 నుంచి మిగిలిన పింఛన్‌దారులందరికీ.
విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ పింఛన్‌దారులు తమ పీపీఓ నంబర్లకు కేటాయించిన తేదీల్లో స్మార్ట్‌ కార్డుతో హాజరై శ్రీవారి ప్రసాదాలను స్వీకరించాలని టీటీడీ కోరింది.

ఇవి కూడా చదవండి