నవంబర్‌ 7 నుంచి 20 వరకు టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి ప్రసాదాల పంపిణీ

తిరుపతి, నవంబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల): టీటీడీ విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ పింఛన్‌దారులకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాలను నవంబర్‌ 7 నుంచి 20వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుపతిలోని టీటీడీ క్యాంటీన్‌ వద్ద ఉన్న కొత్త జాబిలి భవనంలో ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రసాదాల పంపిణీ జరుగుతుంది. పింఛన్‌దారులు తమ స్మార్ట్‌ కార్డు చూపించి ఒక పెద్ద లడ్డూ, ఒక వడ ప్రసాదం పొందవచ్చు. పీపీఓ నంబర్ల వారీగా పంపిణీ వివరాలు: - నవంబర్‌ 7: 164 నుంచి 3,250 వరకు. - నవంబర్‌ 9 నుంచి 13 వరకు: 3,251...