Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రాజ్యాంగ పరిరక్షణకు గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు

Author
Posted By Nagilla Rajinikanth
| 04 Nov 2026, 06:41 PM |
రాజ్యాంగ పరిరక్షణకు గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు


ముస్తాఫాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మాడుగుల సంపత్ కుమార్ ఎన్నిక

భీమదేవరపల్లి, నవంబర్‌ 04 (ప్రజానేస్తం జ్వాల):
భారత రాజ్యాంగ పరిరక్షణతో పాటు ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు గ్రామస్థాయి నుంచి కమిటీలను బలోపేతం చేయాలని భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తాఫాపూర్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా మాడుగుల సంపత్ కుమార్‌ను ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నవంబర్ 26ను పురస్కరించుకుని హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించనున్న రాజ్యాంగ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వేడుకలకు అంబేద్కర్‌వాదులు, రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నియోజకవర్గ కోఆర్డినేటర్ డ్యాగల సారయ్య, భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక మండల అధ్యక్షుడు ఉప్పుల కుమారస్వామి, మాజీ వైస్ ఎంపీపీ మాడుగుల ఎజ్రా, కడారి శ్రీనివాస్, మాడుగుల ప్రభుదాస్, గంగారపు రాజయ్య, ఇల్లందుల కిషోర్, రెంటాల స్వామి, ఎడ్ల సుధాకర్, గొట్టే మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.