రాజ్యాంగ పరిరక్షణకు గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు

ముస్తాఫాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మాడుగుల సంపత్ కుమార్ ఎన్నిక భీమదేవరపల్లి, నవంబర్‌ 04 (ప్రజానేస్తం జ్వాల): భారత రాజ్యాంగ పరిరక్షణతో పాటు ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు గ్రామస్థాయి నుంచి కమిటీలను బలోపేతం చేయాలని భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తాఫాపూర్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా మాడుగుల సంపత్ కుమార్‌ను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నవంబర్ 26ను పురస్కరించుకుని హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించనున్న రాజ్యాంగ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను...