Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి

Author
Posted By Praja Nestham Jwala News
| 04 Nov 2026, 06:40 PM |
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి

సూర్యాపేట, నవంబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల):

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, విద్యాబోధన ప్రమాణాలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. ఆకుపాముల జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, వంటగదిని పరిశీలించారు. మధ్యాహ్న భోజన తయారీ, నిర్వహణ తీరును సమీక్షించారు.

అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, విద్యా ప్రమాణాలు, పరీక్షల సన్నద్ధత గురించి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల అభ్యసన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలోని సమస్యలు, అవసరమైన మౌలిక సదుపాయాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

విద్యాబోధనపై ప్రత్యేక దృష్టి

ఇవి కూడా చదవండి

పాఠశాలల తనిఖీల్లో భాగంగా ఫైనల్ ఇన్‌స్పెక్షన్ బృందంతో సమావేశమైన కలెక్టర్ విద్యాబోధన నాణ్యతపై పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయుల బోధనా పద్ధతులు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, లెర్నింగ్ అవుట్‌కమ్స్ ఆధారంగా పాఠాలు బోధిస్తున్న తీరును పరిశీలించాలని ఆదేశించారు.

టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వినియోగం, లెసన్ ప్లాన్లు, ఇయర్ ప్లాన్లు, టీచింగ్ డైరీల నిర్వహణను తనిఖీ చేయాలని సూచించారు. వర్క్‌షీట్ల ద్వారా విద్యార్థులకు నిరంతర అభ్యాసం కల్పించాలని, ఉపాధ్యాయులు విద్యార్థులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పాఠశాల స్టాఫ్ రూమ్ పైకప్పు శిథిలావస్థకు చేరి స్లాబ్ దెబ్బతిన్న విషయాన్ని ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యపై ఇప్పటికే ఎంపీడీఓకు దరఖాస్తు చేసినట్లు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నాణ్యమైన విద్య అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.