ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి

సూర్యాపేట, నవంబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, విద్యాబోధన ప్రమాణాలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. ఆకుపాముల జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, వంటగదిని పరిశీలించారు. మధ్యాహ్న భోజన తయారీ, నిర్వహణ తీరును సమీక్షించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, విద్యా ప్రమాణాలు, పరీక్షల సన్నద్ధత గురించి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల అభ్యసన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలోని సమస్యలు, అవసరమైన మౌలిక సదుపాయాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యాబోధనపై ప్రత్యేక దృష్టి పాఠశాలల తనిఖీల్లో భాగంగా ఫైనల్ ఇన్‌స్పెక్షన్ బృందంతో...