Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు తావివ్వొద్దు

Author
Posted By Praja Nestham Jwala News
| 04 Nov 2026, 02:36 PM |
రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు తావివ్వొద్దు

వేలేరు, నవంబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల): వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని నాలుగు రేషన్ షాపులను సర్పంచ్ బిల్లా యాదగిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిధిలోని 2,250 రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యాన్ని సక్రమంగా అందించాలని డీలర్లను ఆదేశించారు.

బియ్యం తరుగు పేరుతో కార్డుదారులకు తక్కువ బియ్యం ఇవ్వకూడదని, ప్రతి కార్డుదారునికి పూర్తి పరిమాణంలో బియ్యం పంపిణీ చేయాలని సూచించారు. రేషన్ షాపులను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తూనికలు, కొలతల్లో ఎలాంటి తేడాలు లేకుండా చూడాలన్నారు. పంపిణీలో అక్రమాలకు పాల్పడినా, అవకతవకలు జరిగినా సంబంధిత డీలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ తనిఖీల్లో గ్రామపంచాయతీ కార్యదర్శి విజయ, వార్డు సభ్యులు లక్ష్మీనారాయణ, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి