రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు తావివ్వొద్దు

వేలేరు, నవంబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల): వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని నాలుగు రేషన్ షాపులను సర్పంచ్ బిల్లా యాదగిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిధిలోని 2,250 రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యాన్ని సక్రమంగా అందించాలని డీలర్లను ఆదేశించారు. బియ్యం తరుగు పేరుతో కార్డుదారులకు తక్కువ బియ్యం ఇవ్వకూడదని, ప్రతి కార్డుదారునికి పూర్తి పరిమాణంలో బియ్యం పంపిణీ చేయాలని సూచించారు. రేషన్ షాపులను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తూనికలు, కొలతల్లో ఎలాంటి తేడాలు లేకుండా చూడాలన్నారు. పంపిణీలో అక్రమాలకు పాల్పడినా, అవకతవకలు జరిగినా సంబంధిత డీలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో...