Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కోతులు, వీధి కుక్కల బెడద నుంచి నేరేడుచర్ల ప్రజలను కాపాడండి!

Author
Posted By Praja Nestham Jwala News
| 02 Nov 2026, 01:35 PM |
కోతులు, వీధి కుక్కల బెడద నుంచి నేరేడుచర్ల ప్రజలను కాపాడండి!

  • మున్సిపల్ కమిషనర్‌కు సిపిఐ నాయకుల వినతిపత్రం

నేరేడుచర్ల, నవంబర్ 02 (ప్రజానేస్తం జ్వాల):

నేరేడుచర్ల పట్టణంలో కోతులు, వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోందని, వాటి నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కమిషనర్ నాగరాజుకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ధూళిపాళ ధనుంజయ నాయుడు మాట్లాడుతూ పట్టణంలోని పలు ప్రాంతాల్లో కోతులు, వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు, గర్భిణులు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారని తెలిపారు.
వీధి కుక్కల దాడులతో కరిచే ప్రమాదం ఉండటమే కాకుండా, రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు కూడా ఉందని పేర్కొన్నారు. కోతులు ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను చిందరవందర చేయడంతో పాటు మహిళలు, చిన్నారులను భయపెడుతున్నాయని తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని వీధి కుక్కల నియంత్రణకు, కోతుల బెడద నివారణకు మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించడం వల్ల కోతులు నివాస ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నాయని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా గౌరవాధ్యక్షుడు చిలకరాజు శ్రీను, సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్, సిపిఐ సీనియర్ నాయకుడు బెల్లంకొండ గోవిందు గౌడ్, ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు పరికె భరత్, ఇన్సాఫ్ నాయకుడు ఎస్.కె. సైదా కాసిం, బీసీ హక్కుల సాధన సమితి మండల అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, కొదమగుండ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి