కోతులు, వీధి కుక్కల బెడద నుంచి నేరేడుచర్ల ప్రజలను కాపాడండి!
మున్సిపల్ కమిషనర్‌కు సిపిఐ నాయకుల వినతిపత్రం నేరేడుచర్ల, నవంబర్ 02 (ప్రజానేస్తం జ్వాల): నేరేడుచర్ల పట్టణంలో కోతులు, వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోందని, వాటి నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కమిషనర్ నాగరాజుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ధూళిపాళ ధనుంజయ నాయుడు మాట్లాడుతూ పట్టణంలోని పలు ప్రాంతాల్లో కోతులు, వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు, గర్భిణులు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారని తెలిపారు. వీధి కుక్కల దాడులతో కరిచే ప్రమాదం ఉండటమే కాకుండా, రేబిస్...