Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల్లో కొత్త వెసులుబాటు

Author
Posted By Marelli kiran
| 31 Oct 2026, 08:50 PM |
సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల్లో కొత్త వెసులుబాటు

హనుమకొండ, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల):

సీబీఎస్‌ఈ 2028 పదో తరగతి బోర్డు పరీక్షల విధానంలో కీలక మార్పులు ప్రకటించింది. కొత్త విధానం ప్రకారం విద్యార్థులకు ఐదు తప్పనిసరి సబ్జెక్టులతో పాటు అదనపు స్కిల్ సబ్జెక్టును ఎంచుకునే అవకాశం ఉంటుంది.

2026-27 విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ విధానం వర్తిస్తుంది. వీరు 2027-28 విద్యా సంవత్సరంలో పదో తరగతి బోర్డు పరీక్షలు రాయనున్నారు. గణితం, సైన్స్, సోషల్ సైన్స్‌లలో ఏదైనా ఒక సబ్జెక్టులో తప్పినప్పటికీ, బోర్డు పరీక్షగా నిర్వహించే స్కిల్ సబ్జెక్టులో ఉత్తీర్ణులైతే ఆ సబ్జెక్టుతో ఫెయిలైన సబ్జెక్టును భర్తీ చేసి ఫలితాన్ని లెక్కిస్తారు.

ఇవి కూడా చదవండి

అయితే ఈ వెసులుబాటు బోర్డు పరీక్షకు హాజరయ్యే గుర్తింపు పొందిన స్కిల్ సబ్జెక్టును ఎంచుకున్న విద్యార్థులకే వర్తిస్తుంది. పాఠశాల స్థాయి అంతర్గత మూల్యాంకనం ఉండే 'కౌశల్ వికాస్'ను ఎంచుకున్న వారికి ఈ అవకాశం ఉండదు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ నిబంధనలు వర్తించవు.