సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల్లో కొత్త వెసులుబాటు

హనుమకొండ, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల): సీబీఎస్‌ఈ 2028 పదో తరగతి బోర్డు పరీక్షల విధానంలో కీలక మార్పులు ప్రకటించింది. కొత్త విధానం ప్రకారం విద్యార్థులకు ఐదు తప్పనిసరి సబ్జెక్టులతో పాటు అదనపు స్కిల్ సబ్జెక్టును ఎంచుకునే అవకాశం ఉంటుంది. 2026-27 విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ విధానం వర్తిస్తుంది. వీరు 2027-28 విద్యా సంవత్సరంలో పదో తరగతి బోర్డు పరీక్షలు రాయనున్నారు. గణితం, సైన్స్, సోషల్ సైన్స్‌లలో ఏదైనా ఒక సబ్జెక్టులో తప్పినప్పటికీ, బోర్డు పరీక్షగా నిర్వహించే స్కిల్ సబ్జెక్టులో ఉత్తీర్ణులైతే ఆ సబ్జెక్టుతో ఫెయిలైన సబ్జెక్టును భర్తీ చేసి ఫలితాన్ని లెక్కిస్తారు. అయితే ఈ వెసులుబాటు బోర్డు పరీక్షకు...