Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మిషన్ వాత్సల్య పథకానికి 216 మంది లబ్ధిదారుల ఎంపిక

Author
Posted By Marelli kiran
| 31 Oct 2026, 08:47 PM |
మిషన్ వాత్సల్య పథకానికి 216 మంది లబ్ధిదారుల ఎంపిక

హనుమకొండ, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల):

హనుమకొండ జిల్లాలో మిషన్ వాత్సల్య పథకానికి 216 మంది అర్హులైన బాలబాలికలను ఎంపిక చేసినట్లు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో లబ్ధిదారుల తుది జాబితాను ఖరారు చేసినట్లు వెల్లడించారు.

తల్లిదండ్రులు లేని పిల్లలు, దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల సంతానం, అత్యవసర రక్షణ అవసరమైన బాలబాలికలు తదితర ఏడు కేటగిరీల్లో క్షేత్రస్థాయి విచారణ చేపట్టి అర్హులను గుర్తించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఎంపికైన పిల్లలకు ప్రభుత్వం నుంచి నెలవారీ ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి