మిషన్ వాత్సల్య పథకానికి 216 మంది లబ్ధిదారుల ఎంపిక
హనుమకొండ, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల):
హనుమకొండ జిల్లాలో మిషన్ వాత్సల్య పథకానికి 216 మంది అర్హులైన బాలబాలికలను ఎంపిక చేసినట్లు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో లబ్ధిదారుల తుది జాబితాను ఖరారు చేసినట్లు వెల్లడించారు.
తల్లిదండ్రులు లేని పిల్లలు, దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల సంతానం, అత్యవసర రక్షణ అవసరమైన బాలబాలికలు తదితర ఏడు కేటగిరీల్లో క్షేత్రస్థాయి విచారణ చేపట్టి అర్హులను గుర్తించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఎంపికైన పిల్లలకు ప్రభుత్వం నుంచి నెలవారీ ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు.