Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కాచవరగూడెంలో ఘనంగా శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవం

Author
Posted By Praja Nestham Jwala News
| 31 Oct 2026, 06:40 PM |
కాచవరగూడెంలో ఘనంగా శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవం

గరిడేపల్లి, అక్టోబర్‌ 31 (ప్రజానేస్తం జ్వాల): సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కాచవరగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు జనేగల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమ ఏర్పాట్లు జరిగాయి.

ముఖ్య అతిథిగా హాజరైన గరిడేపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు కుక్కడాపు వెంకటేశ్వర్లు గౌడ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు నర్సింగ్ నాగసైదులు, మేకపోతుల వీరప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రారంభోత్సవంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.