కాచవరగూడెంలో ఘనంగా శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవం
గరిడేపల్లి, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల): సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కాచవరగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు జనేగల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమ ఏర్పాట్లు జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన గరిడేపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు కుక్కడాపు వెంకటేశ్వర్లు గౌడ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో...