Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సూర్యాపేట మున్సిపాలిటీకి రెండో విడతలో 657 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

Author
Posted By Praja Nestham Jwala News
| 31 Oct 2026, 06:34 PM |
సూర్యాపేట మున్సిపాలిటీకి రెండో విడతలో 657 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

సూర్యాపేట, అక్టోబర్‌ 31 (ప్రజానేస్తం జ్వాల): సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో రెండో విడతలో 657 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. ఇప్పటికే 319 ఇళ్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

పట్టాలు పొందిన లబ్ధిదారులు వారం రోజుల్లో నిర్మాణాలు ప్రారంభించి, 100 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. బేస్‌మెంట్, లింటెల్, రూఫ్ లెవల్ దశల్లో నిర్మాణ పురోగతిని బట్టి విడతల వారీగా నిధులు విడుదల చేస్తామని చెప్పారు. 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిబంధనలకు అనుగుణంగా ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు.

మున్సిపల్ చైర్‌పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్ష్యాద మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాల ద్వారా నిర్మాణ రంగ కార్మికులకు, స్థానిక వ్యాపారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో కొత్త పెన్షన్ల కోసం సుమారు 3,100 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు, అర్హులకు పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ జబ్బర్, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీఉల్లా, అధికారులు, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.