సూర్యాపేట మున్సిపాలిటీకి రెండో విడతలో 657 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

సూర్యాపేట, అక్టోబర్‌ 31 (ప్రజానేస్తం జ్వాల): సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో రెండో విడతలో 657 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. ఇప్పటికే 319 ఇళ్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పట్టాలు పొందిన లబ్ధిదారులు వారం రోజుల్లో నిర్మాణాలు ప్రారంభించి, 100 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. బేస్‌మెంట్, లింటెల్, రూఫ్ లెవల్ దశల్లో నిర్మాణ పురోగతిని బట్టి విడతల వారీగా నిధులు విడుదల చేస్తామని చెప్పారు. 400 నుంచి 600 చదరపు...