Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఘనంగా 14వ వార్డు కౌన్సిలర్ దగ్గుపాటి కవిత బాబురావు జన్మదిన వేడుకలు

Author
Posted By Praja Nestham Jwala News
| 31 Oct 2026, 04:51 PM |
ఘనంగా 14వ వార్డు కౌన్సిలర్ దగ్గుపాటి కవిత బాబురావు జన్మదిన వేడుకలు

  • మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు


హుజూర్‌నగర్, అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల): హుజూర్‌నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో 14వ వార్డు కౌన్సిలర్, DSR ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి కవిత బాబురావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, గౌరవ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డితో పాటు కౌన్సిలర్లు పులిచింతల వెంకటరెడ్డి, అట్లూరి మంజులమ్మ, దొంతిరెడ్డి పద్మమ్మ, జక్కుల మల్లయ్య, బెల్లంకొండ శ్రీనివాస్, కోళ్ల నాగేశ్వరరావు, చెన్నగాని సైదులు, నందిగామ శ్రీనివాస్, మోదాల సైదులు, ఎడ్ల విజయ్, కోడి ఉపేందర్, నల్లగొండ సుజాత చంటి, చిట్టిపోతుల రమేష్, అమరారపు ప్రవీణ్, చిన్నపంగు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా కౌన్సిలర్ దగ్గుపాటి కవిత బాబురావు కేక్ కట్ చేయగా, హాజరైన ప్రజాప్రతినిధులు, నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

తన జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆప్యాయతతో శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ దగ్గుపాటి కవిత బాబురావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఆత్మీయత, అభిమానాల నడుమ ఆనందోత్సాహంగా సాగిన ఈ జన్మదిన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.